
జనరల్

కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సంబంధించిన నలుగురు ప్రైవేటు కార్యదర్శులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన నాలుగు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నిర్ణయానికి కారణాలు వెల్లడించలేదు. తొలగింపులో ప్రైవేటు కార్యదర్శి, సహాయ ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేటు కార్యదర్శులు ఉన్నారు.
2010 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి అమర్ సింగ్‌ను 2024 జూన్‌లో ప్రైవేటు కార్యదర్శిగా నియమించగా, ఆయన పదవీకాలం సెప్టెంబర్ 7 వరకు ఉండాల్సి ఉంది. కానీ ముందుగానే ఆయనను రిలీవ్ చేసి స్వశాఖకు పంపించారు. సహాయ ప్రైవేటు కార్యదర్శి సిద్ధార్థ్ యాదవ్ నియామకాన్ని రద్దు చేసి, అదనపు ప్రైవేటు కార్యదర్శులు ఆయుష్ శరణ్, శైలేశ్ కుమార్ సింగ్‌లను కూడా తొలగించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!