

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భద్రతకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు ప్రాణహాని ఉందన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, అప్పట్లో భద్రతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించారని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో జరిగిన భావోద్వేగ సంభాషణలో కుటుంబం ఎదుర్కొన్న పాత సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఈ సంభాషణకు సంబంధించిన వివరాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
1991 మార్చిలో రాజీవ్ గాంధీ బిహార్‌లో ఓపెన్ జీపులో పర్యటిస్తున్నప్పుడు కొందరు నిరసనకారులు ఆయనపై రాళ్లు రువ్వారని సోనియా తెలిపారు. ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్న రాహుల్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారని, ఇంటికి తిరిగి వచ్చాక కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. తండ్రి భద్రతపై రాహుల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. అలాగే 1968లో ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన తొలిరోజుల అనుభవాలను కూడా సోనియా పంచుకున్నారు. తన తల్లి ఆత్మకథలో కుటుంబం గురించి ఎన్నో విషయాలు రాసినా, చెప్పాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!