
సినిమాలు

బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన చేపట్టారు. ప్యానల్ స్పీకర్ సభా కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా, విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అయోధ్యలో విరాళాల చోరీ ఆరోపణలు, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై వెంటనే చర్చ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
నిరసనల మధ్యే ప్రభుత్వం శాసన కార్యక్రమాన్ని కొనసాగించి బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభా కార్యక్రమాలను ముగిస్తూ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. విపక్ష సభ్యుల నిరసనల కారణంగా సభలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!