
బిజినెస్

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ మూడు కీలక పోస్టులను గెలుచుకుంది. ఏబీవీపీ అభ్యర్థి యష్ దబాస్ 24,576 ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి చెందిన రియా ఛావ్డీ కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు షోకీన్ 30,615 ఓట్లతో గెలుచుకున్నారు.
డీయూఎస్‌యూ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు నార్త్ క్యాంపస్‌లోని యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం మల్టీపర్పస్ హాల్‌లో ప్రారంభమై 20 రౌండ్ల అనంతరం పూర్తైంది. అధ్యక్ష పదవిలో యష్ దబాస్.. ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి విజయ్ శంకర్ మీనాపై 2,053 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఏ-ఎస్‌ఎఫ్‌ఐ కూటమి సహా పలు వర్గాల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!