
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలపై కేంద్ర సహాయం కోరుతూ చర్చలు జరిపారు. సముద్ర సంరక్షణ చట్టాలు, గోదావరి కాలుష్య నియంత్రణ, అలాగే ఏపీ గ్రీనింగ్ సొసైటీ వంటి పర్యావరణ కార్యక్రమాలకు కేంద్ర నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే వన్యప్రాణి సంరక్షణలో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి మొత్తం 6 పులులను ఏపీకి తరలించే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 4 పులులకు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ 2 పులులకు అంగీకరించినట్లు సమాచారం. ఈ పథకాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!