

ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భాగవత్, కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన నమోదు, నిధులు, ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాల వివరాల వెల్లడి డిమాండ్‌ను రాజకీయ కోణంలో చూడాలని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది అవుట్‌రీచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇటువంటి ఆరోపణలు, విమర్శలు తమకు కొత్త కాదని, ఇవి రాజకీయ ప్రక్రియలో భాగమేనని పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి రహస్య సంస్థ కాదని, తమ కార్యకలాపాలు పూర్తిగా బహిరంగంగానే జరుగుతాయని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ప్రజలను ఆహ్వానించి తమ పనితీరును వివరిస్తామని తెలిపారు. సంస్థ నమోదు అంశంపై స్పందిస్తూ, ప్రతి వ్యవస్థకు నమోదు తప్పనిసరి కాదని, అనేక సంస్థలు, సంప్రదాయాలు నమోదు లేకుండానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ తన సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తుందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!