

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, తక్షణ నిర్ణయం వెలువడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ‘తమిళగ మక్కల్ కళగం’ లేదా ‘తమిళగ మక్కల్ కట్చి’ పేర్లతో కొత్త పార్టీ నమోదుకు ఎన్నికల సంఘానికి దరఖాస్తులు సమర్పించినట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదిత పార్టీ అన్నామలై భవిష్యత్ రాజకీయ ప్రణాళికలకు సంబంధించినదిగా భావిస్తున్నారు. వచ్చే ఆరు నెలల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ, ‘వియ్ లీడర్స్’ ట్రస్టు కార్యకలాపాలను విస్తరించే దిశగా అడుగులు వేయవచ్చని తెలుస్తోంది. మరోవైపు, ఆర్ఎస్ఎస్ జోక్యంతో అన్నామలై బీజేపీలోనే కొనసాగాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మదురైలో అన్నామలైకు మద్దతుగా పోస్టర్లు వెలిసాయి. ఆ పోస్టర్లలో నటులు అజిత్ కుమార్, రజనీకాంత్ చిత్రాలు కూడా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!