

విశాఖపట్నం జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో బాధితులైన మత్స్యకార కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు, ప్రాణాలతో బయటపడిన చిన్నాను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ నెల 1న వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో జూలై 4న ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం ఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే పలువురు మత్స్యకారుల ప్రాణాలు కాపాడవచ్చని జగన్ ఆరోపించారు. కోస్ట్ గార్డ్, ఫిషరీస్ అధికారులు సకాలంలో స్పందించలేదని, ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన, ప్రభుత్వం ఇవ్వకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నా కుటుంబానికీ ఇదే సాయం అందజేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!