

ఓట్స్‌ను చిన్నచూపు చూడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. రోజుకు రెండు కప్పుల వరకు ఓట్స్ తీసుకోవచ్చని, అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి పరిమాణాన్ని మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ ఉన్నవారు ఓట్స్‌ను నీరు లేదా తక్కువ మోతాదులో పాలతో ఉడికించి తీసుకోవాలని సూచిస్తున్నారు. పంచదారకు బదులుగా దాల్చినచెక్క పొడి, డ్రైఫ్రూట్స్, గింజలు కలిపి తీసుకుంటే రుచితో పాటు పోషక విలువలు పెరుగుతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణకు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండేందుకు, బరువు నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపడేందుకు సహాయపడతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!