

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత భారాస పాలనలాగే సింగరేణిని దోచుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను రక్షించే బాధ్యతను భాజపా తీసుకుందని, త్వరలోనే కార్మికులకు శుభవార్త అందిస్తామని తెలిపారు. ‘సింగరేణి భరోసా యాత్ర’లో భాగంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించిన ఆయన, కార్మికులతో సమావేశాలు నిర్వహించారు.
రెండు ప్రభుత్వాలు బొగ్గును వినియోగించుకున్నా సంస్థకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదని, దీంతో సింగరేణి వేతనాల కోసం బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోందని విమర్శించారు. భారాస, కాంగ్రెస్ పాలనల్లో అవినీతి, అక్రమాలు పెరిగాయని ఆరోపించారు. సింగరేణి తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, రాజకీయాలకు అతీతంగా కార్మికులు ఐక్యంగా సంస్థను రక్షించాలన్నారు. పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!