
సినిమాలు

తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించినట్లు సమాచారం. బుధవారం కేసును విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని దానం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోరినట్లు సమాచారం. మరోవైపు ప్రతివాది తరఫు న్యాయవాది విచారణను మరో తేదీకి వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!