
జనరల్

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించే ఎన్నికలు నిష్పక్షపాతంగా ఉండవని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఆరోపించారు. కొచ్చిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్నికల నిర్వహణ విధానంపై తమకు విశ్వాసం లేదని, ఎన్నికల ప్రక్రియపై అనేక సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు.
స్వతంత్ర, నిష్పక్షపాత ఎన్నికల వ్యవస్థ ఏర్పడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధత ఉండాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేరళంలో తమ పార్టీకి అత్యధిక సంఖ్యలో యువ సభ్యులు ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!