7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ED అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Writer: Chandrika 06:02 PM, 7 నవంబర్, 2026
ED అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపైనా విచారణ చేపట్టే అధికారం ఆ సంస్థకు లేదని స్పష్టం చేసింది. మనీలాండరింగ్‌ కేసుల దర్యాప్తులో చట్టబద్ధమైన నిబంధనలను పక్కనపెట్టలేదని పేర్కొంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (PMLA) పరిధిలోకి రాని నేరాలపై ఆ చట్టం కింద దర్యాప్తు చేపట్టకూడదని ఆదేశించింది. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేవై నంజగౌడతో పాటు ఆయనతో సంబంధం ఉన్న పలువురు పిటిషనర్లపై ED చేపట్టిన దర్యాప్తు ప్రక్రియలను జస్టిస్‌ ఎం.ఐ. అరుణ్‌ కొట్టివేశారు.

ఆస్తుల జప్తును ధ్రువీకరిస్తూ PMLA అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేసింది. పిటిషనర్లలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోలారు, చిక్కబళ్లాపుర జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్‌ లిమిటెడ్‌ (కోముల్‌)లో ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ED దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నియామకాల్లో అవకతవకలకు సంబంధించి FIR లేదా అధికారిక క్రిమినల్‌ కేసు నమోదైనప్పుడే ED దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది. మనీలాండరింగ్‌ ఆరోపణలను సుమోటోగా పరిగణించి విచారణ ప్రారంభించడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..

వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..

తమిళనాడు కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

తమిళనాడు కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..

ట్యాగ్లు
కర్ణాటక హైకోర్టుఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ED దర్యాప్తుPMLA చట్టంమనీలాండరింగ్‌కేవై నంజగౌడకర్ణాటక రాజకీయాలుకోముల్‌ నియామకాలుఆస్తుల జప్తున్యాయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..
జనరల్

సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..

కిమ్ జోంగ్ ఉన్ రహస్య సైబర్ సైన్యం..
జనరల్

కిమ్ జోంగ్ ఉన్ రహస్య సైబర్ సైన్యం..

ED అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ED అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌
రాజకీయాలు

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్
సినిమాలు

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్
సినిమాలు

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
రాజకీయాలు

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..
జనరల్

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు
రాజకీయాలు

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
జనరల్

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!
రాజకీయాలు

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!