

విలక్షణ నటుడు కమల్‌హాసన్, దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ కలయికలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘సండియర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కమల్ చేతిలో తుపాకీ పట్టుకుని, సీరియస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.
ఈ సినిమా విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సునీల్ కె.ఎస్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కమల్‌హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై టైటిల్ ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!