

తెలంగాణలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌పై BJP నేత రాంచందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ రాజకీయంగా మరోసారి ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ఆయన రాజకీయ రీలాంచ్ కోసం చేస్తున్న మరో విఫల ప్రయత్నమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా గాంధీ కుటుంబ రాజకీయ పునరావాసానికి నిధి కాదని, ప్రజల సొమ్మును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించకూడదని హితవు పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని రాంచందర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, రైతులకు రైతుబంధు నిధులు అందడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రచార కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజా సంక్షేమం వైపు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!