25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ..

Writer: Chandrika 10:08 AM, 25 సెప్టెంబర్, 2026
తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ..

తెలంగాణలో భూ అక్రమాలు, ఆక్రమణలు, భూ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 16న శాసనసభలో సెక్షన్‌ 22-ఏకు సంబంధించిన భూ అంశాలపై జరిగిన చర్చ నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, భాగస్వాములకు సంబంధించిన భూములతో పాటు పలు ఇతర భూ వ్యవహారాలను కమిటీ పరిశీలించనుంది. సిద్ధిపేట, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ జిల్లాల్లోని 16 అంశాలను విచారణ పరిధిలోకి తీసుకున్నారు.

కాలేజియేట్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎ.శ్రీదేవసేనను కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, సంబంధిత జిల్లాల కలెక్టర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ఎసైన్డ్‌, సీలింగ్‌, భూదాన్‌, ఇనాం, జాగీర్‌, అటవీ భూములతో పాటు భూసేకరణ, పునరావాసం, నీటి వనరుల పరిధిలోని ఆక్రమణలు, భూ రికార్డుల్లో అక్రమాలపై విచారణ జరగనుంది. అవసరమైన రికార్డులు, పత్రాలు, సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు, కలెక్టరేట్లు, స్థానిక సంస్థల నుంచి సేకరించే అధికారం కమిటీకి ఉంది. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యతను గుర్తించి తగిన చర్యలకు సిఫార్సులు చేయడంతో పాటు, అవసరాన్ని బట్టి మధ్యంతర నివేదికలను కూడా సమర్పించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
తెలంగాణతెలంగాణ ప్రభుత్వంరేవంత్ రెడ్డిభూ అక్రమాలుభూ ఆక్రమణలుభూ వివాదాలుకేసీఆర్కేటీఆర్హరీశ్ రావుభూ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
క్రీడలు

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి
బిజినెస్

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...
క్రీడలు

ఆసియా క్రీడల్లో సింధు, లక్ష్యకు కఠిన డ్రా...

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!
జనరల్

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.. కానీ..!

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం
జనరల్

దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం

ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..
క్రీడలు

ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..

చెస్‌ ఒలింపియాడ్‌ లో భారత జట్లకు డ్రా...
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌ లో భారత జట్లకు డ్రా...

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..
జనరల్

గణేష్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు..

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?
షోస్

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎన్నికల ప్రక్రియపై మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!