

తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ పలు కీలక నీటి పారుదల డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కర్ణాటక చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరింది. అలాగే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించి, కేంద్రం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేసింది.
కృష్ణా జలాల విషయంలోనూ తెలంగాణ తన వాదనను వినిపించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న రాష్ట్రాలు రెండేనని, ఈ అంశంలో కర్ణాటకకు సంబంధం లేదని పేర్కొంది. 2016 అక్టోబర్లోనే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేసింది. గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని తెలంగాణ ప్రతిపాదించింది. 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వడంతో పాటు, ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని తరలించుకునేలా అనుమతించాలని కోరింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!