

తెలంగాణలో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సదస్సు భారత్ సమ్మిట్ కాదని, ముమ్మాటికీ ‘యాంటీ భారత్ సమ్మిట్’ అని వ్యాఖ్యానించారు. కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి, దృక్పథం, విజన్ లేని రాహుల్ గాంధీని ప్రోత్సహించేందుకే ఈ సదస్సును నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నాగోల్‌లో జరిగిన భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఒక్క పెట్టుబడిదారుడు కూడా వచ్చే అవకాశం లేదని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాయని తాను ఆరోపించే ప్రోగ్రెసివ్ అలయన్స్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థల ప్రతినిధులే ఈ సదస్సుకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో చోటుచేసుకున్న అస్థిరత, ఆందోళనల వెనుక ఇలాంటి సంస్థల పాత్ర ఉందని కూడా ఆరోపించారు.
సల్మాన్ ఖుర్షీద్, శ్యామ్ పిట్రోడా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు రాహుల్ గాంధీ అభిప్రాయాలను వినిపించేందుకే ఉద్దేశించిందని రాంచందర్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఉద్యోగాల కల్పన పేరుతో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని రాహుల్ గాంధీపై ఆరోపణలు చేశారు. ఆ హామీలను నెరవేర్చకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టే నైతిక హక్కు ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్లజెండాలతో ఆందోళనలు నిర్వహించాలని, దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాగోల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!