

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై తమకు నమ్మకం లేదని, ఆ దేశం ఎప్పుడూ తమతో అబద్ధాలు చెబుతుందని వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ నియంత్రణ ఉందని ట్రంప్ పేర్కొన్నారు. చర్చల నుంచి ఇరాన్ వెనక్కి తగ్గినా, దుందుడుకు చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలతో పనామా జెండాతో ఉన్న ‘వేలా నోవా’ కార్గో నౌకపై అమెరికా నేవీ హెలికాప్టర్ రెండు హెల్‌ఫైర్ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటన గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చోటుచేసుకుంది. మరోవైపు హర్మూజ్ సంక్షోభం కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల కోసం నౌకలు పనామా కాలువ వైపు మళ్లుతుండటంతో అక్కడ డిమాండ్ పెరిగింది. కొన్ని ట్రాన్సిట్ స్లాట్‌ల వేలం ధరలు దాదాపు 3.8 మిలియన్ డాలర్లకు చేరాయి. ఎల్‌నినో ప్రభావంతో నీటి మట్టాలపై ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!