

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కచ్చితంగా అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ కోరింది. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాతో పాటు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. పోలింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం వంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాలను భద్రపరచాలని కూడా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి అంశంపై విడివిడిగా ఎస్‌ఈసీకి లేఖలు రాసింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!