

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రాజకీయ సవాళ్ల వ్యవహారంపై కొందరు మంత్రుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ భవన్‌కు వస్తామని సవాల్ చేసిన వారు అక్కడే ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాన్ని బహిరంగ చర్చలో ఎదుర్కొని వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిందని, అనవసర వివాదాలకు అవకాశం ఇవ్వొద్దని ఆయన సూచించినట్లు సమాచారం.
అలాగే ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. 2027 డిసెంబర్ నాటికి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసి, దానిని తదుపరి ఎన్నికల ప్రధాన విజయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!