2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

Writer: Pooja 03:13 PM, 2 నవంబర్, 2026
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

విదేశాల్లో ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలనేది ఎంతోమంది యువత, సామాన్యుల కల. అయితే ఈ ఆశను ఆసరాగా చేసుకుని నకిలీ రిక్రూటింగ్‌ ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టి, విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లేవారికి సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసిన ఈ-మైగ్రేట్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రభుత్వం గుర్తించిన 2,300కు పైగా యాక్టివ్‌ రిజిస్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఏజెంట్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఏజెంట్లు ఇచ్చే లైసెన్స్‌ నంబర్‌ను నమోదు చేసి దాని చెల్లుబాటును ధ్రువీకరించుకోవచ్చు. అలాగే మోసపూరిత ఏజెంట్లపై వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఏజెన్సీల వివరాలను కూడా పరిశీలించవచ్చు.

ఈ పోర్టల్‌లో రిజిస్టర్డ్‌ విదేశీ యజమానులు, కంపెనీల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉద్యోగార్థులు తమకు వచ్చిన ఆఫర్‌ లెటర్‌ నిజమైనదా, సంబంధిత కంపెనీ అధికారికంగా నమోదై ఉందా అనే విషయాలను సరిచూసుకోవచ్చు. విదేశాంగ శాఖ ఈ-మైగ్రేట్‌ పోర్టల్‌కు పలు డిజిటల్‌ సేవలను జోడించింది. డిజీలాకర్‌ అనుసంధానం ద్వారా పాస్‌పోర్ట్‌, ఉపాధి ఒప్పంద పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో సురక్షితంగా సమర్పించవచ్చు. భాషిణి యాప్‌ సహాయంతో ఇంగ్లీష్‌ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారు కూడా తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని చదువుకోవచ్చు. అదనపు లావాదేవీ రుసుములు లేకుండా డిజిటల్‌ చెల్లింపులు చేసే సదుపాయం కూడా ఉంది. అర్హులైన వలస కార్మికులు ప్రవాసి భారతీయ బీమా యోజన పాలసీని నేరుగా ఈ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

విదేశాలకు వెళ్లిన తర్వాత ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కూడా ఈ-మైగ్రేట్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. యజమానులు వేధించినా, ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించకపోయినా బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 24 గంటల బహుభాషా హెల్ప్‌లైన్‌తో పాటు +91 74283 21144 వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రిజిస్టర్డ్‌ ఏజెంట్ల లైసెన్స్‌ నంబర్లు, వాటి చెల్లుబాటు వివరాలు తెలుసుకోవడంతో పాటు విదేశీ ఉద్యోగాల కోసం స్థానికంగా నిర్వహించే ఇంటర్వ్యూల షెడ్యూళ్లను కూడా పరిశీలించవచ్చు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు సేవలు చేరువ చేసేందుకు ఈ పోర్టల్‌ను కామన్‌ సర్వీస్‌ సెంటర్లతో అనుసంధానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్

సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

ట్యాగ్లు
ఈ మైగ్రేట్ పోర్టల్విదేశీ ఉద్యోగాలుఉద్యోగ మోసాలువిదేశీ ఉపాధిభారతీయ కార్మికులువిదేశాంగ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యాపిల్ వాచ్‌కే సవాల్ విసిరిన దీపిందర్ గోయల్
టెక్నాలజీ

యాపిల్ వాచ్‌కే సవాల్ విసిరిన దీపిందర్ గోయల్

స్థానిక ఎన్నికల్లో హింసపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం.. చంద్రబాబుపై విమర్శలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో హింసపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం.. చంద్రబాబుపై విమర్శలు

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్
సినిమాలు

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన వైఎస్ జగన్
రాజకీయాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన వైఎస్ జగన్

బీజేపీ పాదయాత్రలో టీడీపీ, జనసేన జెండాలు.. తెలంగాణలో కొత్త రాజకీయ చర్చ
రాజకీయాలు

బీజేపీ పాదయాత్రలో టీడీపీ, జనసేన జెండాలు.. తెలంగాణలో కొత్త రాజకీయ చర్చ

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..
సినిమాలు

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి
జనరల్

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

ఐపీఎల్ మినీ వేలంలో ఈ స్టార్ ఆటగాళ్లకు మళ్లీ నిరాశ తప్పదా
క్రీడలు

ఐపీఎల్ మినీ వేలంలో ఈ స్టార్ ఆటగాళ్లకు మళ్లీ నిరాశ తప్పదా

సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్
జనరల్

సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ
క్రీడలు

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ

మోదీని శకునితో పోల్చిన తేజస్వీ..జ్ఞానేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌
రాజకీయాలు

మోదీని శకునితో పోల్చిన తేజస్వీ..జ్ఞానేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !
సినిమాలు

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!