

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి గుంటూరు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వెంగళాయపాలెంలో పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న ఆందోళనలకు సంబంధించి నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అప్పిరెడ్డిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల పాటు న్యాయ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వెంగళాయపాలెంలో పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సును తరలించేందుకు ప్రయత్నించగా, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో గుంటూరు–నల్లపాడు మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!