6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

Writer: Chandrika 03:29 PM, 6 నవంబర్, 2026
తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

తెలంగాణలో బియ్యం ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, ప్రముఖ నటి విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం పండించే రాష్ట్రంలోనే సామాన్యులు బియ్యం కొనలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఆమె ప్రశ్నించారు. గతంలో రూ.1,500కు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం రూ.2,500కు చేరిందని, సన్నబియ్యం కిలో ధర రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతున్నా నియంత్రణ చర్యలు ఎందుకు ఫలించడం లేదని నిలదీశారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న పాత సన్నబియ్యం గత ఏడాది వానాకాలం, అంతకుముందు సీజన్లలో పండినవేనని, అప్పట్లో అవసరానికి మించి ధాన్యం ఉత్పత్తి జరిగిందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి పాత బియ్యం కొరతకు స్పష్టమైన కారణం కనిపించడం లేదని, కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అక్రమ నిల్వలు, బియ్యం అక్రమ విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు, ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ పారదర్శకతపై విజయశాంతి ప్రశ్నలు లేవనెత్తారు. మరణించిన వారి పేర్లపై రేషన్‌ బియ్యం పంపిణీ, నకిలీ రేషన్‌ కార్డులు, అనర్హుల నమోదు, బియ్యం అక్రమ మళ్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుల నుంచి గోదాములకు, అక్కడి నుంచి రేషన్‌ దుకాణాలకు చేరే వరకు ప్రతి గింజకు లెక్క ఉండాలని సూచించారు. తెలంగాణకు ఏడాదికి 28.56 లక్షల టన్నుల బియ్యం అవసరమని, అక్టోబర్‌ 16 నాటికి 9.64 లక్షల టన్నుల నిల్వలు ఉండగా, మరో 18.39 లక్షల టన్నులు రావాల్సి ఉందని అధికారుల లెక్కలను ప్రస్తావించారు. ఈ గణాంకాలపై ప్రభుత్వం పారదర్శకంగా పరిశీలన జరపాలని కోరారు. బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడే మిల్లర్లు, వ్యాపారులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కింది స్థాయిలో జరిగే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని విజయశాంతి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ తీవ్ర ఆరోపణలు

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
విజయశాంతితెలంగాణబియ్యం ధరలుసన్నబియ్యంకాంగ్రెస్‌ ఎమ్మెల్సీబ్లాక్‌ మార్కెటింగ్‌బియ్యం నిల్వలురేషన్‌ పంపిణీప్రజా పంపిణీ వ్యవస్థతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
రాజకీయాలు

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు
జనరల్

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసల వర్షం..
సినిమాలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసల వర్షం..

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..
జనరల్

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లోకి వెళ్లడం నిజమేనా?
క్రీడలు

హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లోకి వెళ్లడం నిజమేనా?

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు
రాజకీయాలు

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు
రాజకీయాలు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు

 కోహ్లీ, రోహిత్‌ ఫీల్డింగ్‌పై ఫీల్డింగ్‌ కోచ్‌ ప్రశంసలు
క్రీడలు

కోహ్లీ, రోహిత్‌ ఫీల్డింగ్‌పై ఫీల్డింగ్‌ కోచ్‌ ప్రశంసలు

వారణాసిలో దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌..
జనరల్

వారణాసిలో దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌..

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు
జనరల్

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గాసిప్స్

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన
రాజకీయాలు

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!