

జనసేన కార్యకర్తలు నిర్వహించినట్లు చెబుతున్న ట్విట్టర్ స్పేస్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలోని మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై పార్టీ లీగల్ సెల్ కాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల అంశం నేపథ్యంలో ఈ ట్విట్టర్ స్పేస్ నిర్వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
త్రినాథ్ కుమార్, రాఘవేంద్ర, పృధ్వీ అనే జనసేన నేతలు ఈ ట్విట్టర్ స్పేస్‌ను నిర్వహించినట్లు గుర్తించినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారితో పాటు ఆ స్పేస్‌లో పాల్గొన్న సుమారు 350 మందిపై ఫిర్యాదు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కోరనున్నట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!