25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

Writer: Harika S 10:48 AM, 25 ఆగస్టు, 2026
బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

బిగ్ బాస్ తెలుగు 10 వచ్చే నెలలో ప్రారంభం కానుండటంతో షోపై బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మైలురాయి సీజన్ కావడంతో కంటెస్టెంట్ల ఎంపికపై కూడా భారీగా చర్చ జరుగుతోంది. హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారనే ఆసక్తి ఒకవైపు ఉండగా.. మరోవైపు బిగ్ బాస్ టీమ్ సంప్రదించినప్పటికీ షోలోకి వెళ్లేందుకు నో చెప్పిన టీవీ సెలబ్రిటీల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి.

విష్ణు

టెలివిజన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రస్తుతం స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇందులో బాలు పాత్రలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ టీమ్ విష్ణును సంప్రదించి ఆకర్షణీయమైన రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఆయన ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.

తేజశ్విని గౌడ

బిగ్ బాస్ తెలుగు విషయంలో కొంతకాలంగా వినిపిస్తున్న మరో పేరు తేజశ్విని గౌడ. టీవీ సీరియల్ నటిగా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అలాగే నటుడు అమర్ దీప్ చౌదరి భార్యగా కూడా ప్రేక్షకులకు సుపరిచితం. గత రెండు, మూడు సీజన్లుగా బిగ్ బాస్ మేకర్స్ ఆమెను సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. షోలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. సీరియల్ కమిట్‌మెంట్స్ కారణంగా ఆమెకు అవకాశం కుదరలేదని తెలుస్తోంది. ఈసారి కూడా ఇదే కారణంతో ఆఫర్‌ను తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది.

దెబ్ జాన్

దెబ్ జాన్ కూడా బిగ్ బాస్ 10 ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ వంటి సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మరో భాషలో ఓ సీరియల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీరియల్ మంచి రేటింగ్స్‌తో కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ను వదులుకుని బిగ్ బాస్‌లోకి వెళ్లేందుకు ఆమె సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది.

కావ్యశ్రీ

ఇక సీరియల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న కావ్యశ్రీ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. బిగ్ బాస్ మేకర్స్ గత రెండు సీజన్లుగా ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే రియాలిటీ షోలో పాల్గొనడంపై ఆమెకు పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌కు వచ్చిన ఆఫర్‌ను కూడా కావ్యశ్రీ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ పేర్లకు సంబంధించి బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల ప్రస్తుతం వస్తున్న సమాచారాన్ని రూమర్స్‌గానే పరిగణించాలి. వచ్చే నెలలో బిగ్ బాస్ 10 ప్రారంభానికి ముందు అధికారిక కంటెస్టెంట్ల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పుడే ఎవరు హౌస్‌లోకి వస్తున్నారు, ఎవరు షోకు దూరంగా ఉన్నారు అనే విషయంపై పూర్తి స్పష్టత రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ 10విష్ణుతేజశ్విని గౌడదెబ్ జాన్కావ్యశ్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!
సినిమాలు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!