

తమిళ బిగ్‌బాస్ సీజన్ 8 విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వహిదా అక్తర్ ఆరోపించారు. గురువారం రాత్రి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి, ముత్తుకుమరన్ తనను ఉపయోగించుకుని వదిలేశారని ఆరోపించినట్లు సమాచారం. తామిద్దరం పలుమార్లు వ్యక్తిగతంగా కలిశామని, తనను ప్రేమిస్తున్నట్లు నటించారని ఆమె పేర్కొన్నారు.
ముత్తుకుమరన్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని చూపించే వీడియోలను కూడా వహిదా సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ ఆమె వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలను షేర్ చేసిన ప్రముఖ తమిళ గీత రచయిత్రి తామరై ఈ ఆరోపణలపై ముత్తుకుమరన్ వివరణ ఇవ్వాలని కోరారు. ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమలో చర్చకు దారితీయగా, వహిదాకు న్యాయం చేయాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై ముత్తుకుమరన్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!