

ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న పలువురు నటులు తమ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినవారే. హీరో ఫ్రెండ్‌గా, తమ్ముడిగా, సైడ్ యాక్టర్‌గా నటించి.. ఆ తర్వాత కథానాయకులుగా ఎదిగారు. అలాంటి నటుల్లో త్రిగుణ్ కూడా ఒకరు. 2015లో విడుదలైన తమిళ చిత్రం తంగా మగన్లో ధనుష్ స్నేహితుడు అరవింద్ పాత్రలో త్రిగుణ్ నటించారు. తెలుగులో ఈ సినిమా నవ మన్మథుడు పేరుతో విడుదలైంది. ఆర్. వెల్రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ నటించగా.. కేఎస్ రవికుమార్, రాధికా శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆ సమయంలో త్రిగుణ్ పెద్దగా గుర్తింపు పొందకపోవడంతో చాలామంది ప్రేక్షకులు ఆయనను గుర్తించలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్‌గా పాల్గొంటూ త్రిగుణ్ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. తన ఆటతీరు, మాటతీరు, ఆత్మవిశ్వాసంతో హౌస్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఆయన ఆటపై కొంత నెగెటివిటీ కూడా వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ప్రస్తుత సీజన్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ముఖ్యమైన కంటెస్టెంట్లలో త్రిగుణ్ ఒకరిగా నిలిచాడు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!