

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ హౌస్ గేట్ వద్ద ప్రత్యక్షమవడంతో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. వీరిలో ఎవరిని హౌస్‌లోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని ప్రస్తుత హౌస్‌మేట్స్‌కే అప్పగిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ముగ్గురూ తమను తాము పరిచయం చేసుకోవడంతోపాటు.. హౌస్‌లోకి వస్తే తమ గేమ్ ఎలా ఉండబోతుందో వివరించారు. మిథిలేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న గ్రూపులను బ్రేక్ చేస్తానని, హౌస్‌లోని ‘మాస్టర్స్, పప్పెట్స్’ ఎవరో బయటపెడతానని చెప్పాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. అపూర్వ మాట్లాడుతూ.. కొంతమంది కంటెస్టెంట్లు తమ అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. అవసరమైతే వాదిస్తానని, తనను తాను డిఫెండ్ చేసుకుంటానని చెప్పింది. రామకృష్ణ మాత్రం సింపుల్‌గా తనను తాను పరిచయం చేసుకుని.. జెన్యూన్‌గా ఉంటూ ఎంటర్టైన్ చేస్తానని చెప్పాడు.
ఆ తర్వాత ముగ్గురి వ్యాఖ్యలు హౌస్‌లో చర్చకు దారితీశాయి. తనను ‘కన్నింగ్’ అని ఎందుకు అన్నావంటూ రామ్ ప్రసాద్ మిథిలేష్‌ను ప్రశ్నించాడు. గతంలో జరిగిన ‘రన్ రాజా రన్’ టాస్క్‌లో అమన్ విషయంలో తీసుకున్న నిర్ణయం తనకు అలా అనిపించిందని మిథిలేష్ వివరించాడు. త్రిగుణ్ కూడా తనను ‘మానిప్యులేటివ్’గా ఎందుకు చూస్తున్నావని మిథిలేష్‌ను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తెలుగు భాషపై కూడా చర్చ జరగగా.. పద్యాలు చెప్పడం వల్లే తెలుగు పరిజ్ఞానాన్ని నిరూపించాల్సిన అవసరం లేదని మిథిలేష్ కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు ముఖేష్ తనను స్టార్ ప్లేయర్‌గా చెప్పుకునే ప్రయత్నం చేయగా.. అపూర్వ అతనికి గట్టిగా సమాధానం ఇచ్చింది. తనకు వచ్చిన ఓట్లు తక్కువగా ఉన్నాయని, వాటిలో ఎక్కువ భాగం తన కూటమి సభ్యుల నుంచే వచ్చాయని వ్యాఖ్యానించింది. మిథిలేష్ హౌస్‌లోకి వస్తే సెట్ కాడని ముఖేష్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోవైపు రామకృష్ణ జెన్యూన్‌గా కనిపిస్తున్నాడని ముఖేష్, సుధీర్, వర్షిణి చర్చించుకున్నారు. దీంతో మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరికి హౌస్మేట్స్ మద్దతు లభించి బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ‘బ్యాక్ బిచ్చింగ్ స్టార్’, ‘కన్నింగ్’, ‘మానిప్యులేటివ్’ వంటి కామెంట్లపై రానున్న ఎపిసోడ్లలో ఎలాంటి చర్చ జరుగుతుందనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!