

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రెండో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఫిజికల్‌గా మారింది. ముందుగా జరిగిన యానిమల్ పార్క్ టాస్క్‌లో ఝాన్సీ, ముఖేష్ విజయం సాధించారు. అమన్, షాలినీ మధ్య టాస్క్‌కు సంబంధించిన అంశంపై వాగ్వాదం జరిగింది. అనంతరం కిచెన్‌లో ముఖేష్ తినే విషయంలో వంశీ, త్రిగుణ్‌తో వివాదం చోటుచేసుకుంది. ఎవరికి నచ్చినట్లు వారు వంట చేసుకోవద్దని, ఏదైనా సమస్య ఉంటే మానిటర్ ద్వారా తెలియజేయాలని వంశీ సూచించాడు.
తర్వాత బిగ్ బాస్ ‘స్నాచ్ ఇట్, ఎయిమ్ ఇట్, త్రో ఇట్’ అనే టాస్క్‌ను వివరించాడు. పై నుంచి విసిరే సంచులను పట్టుకుని, అందులోని బంతులతో గోడను కొట్టి డిస్కులను కింద పడేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో రాం ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా రోహిత్ ఆటలో ఫిజికల్‌గా వ్యవహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
టాస్క్ సమయంలో త్రిగుణ్ తనను అడ్డుకుంటున్నాడని రోహిత్ సంచాలక్ వంశీని ప్రశ్నించాడు. ఈ క్రమంలో రోహిత్, త్రిగుణ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, హౌస్‌మేట్స్ జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దిచెప్పారు. అనంతరం రోహిత్ రాం ప్రసాద్‌ను ఎత్తి పక్కకు పడేయడంతో పాటు త్రిగుణ్‌పైకి దూకి పట్టుకున్నాడు. ఈ క్రమంలో తన కాలికి గాయమైనట్లు రోహిత్ చెప్పాడు. గాయం ఉన్నప్పటికీ త్రిగుణ్ టాస్క్ కొనసాగించాడు.
చివరకు రాం ప్రసాద్, త్రిగుణ్ టాస్క్‌లో విజయం సాధించారు. రోహిత్, దేబ్జానీలలో ఒకరు తప్పుకోవాలని బిగ్ బాస్ సూచించినా వారు నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో రాం ప్రసాద్, త్రిగుణ్‌కు ఆ అవకాశం ఇవ్వగా, వారు రోహిత్‌ను పక్కన పెట్టి దేబ్జానీకి అవకాశం కల్పించారు. దీంతో ముఖేష్, ఝాన్సీ, షాలినీ, రాం ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ కెప్టెన్సీ రేసులో కొనసాగుతున్నారు. తదుపరి ఎపిసోడ్‌లో చరణ్ రీ ఎంట్రీతో పాటు కెప్టెన్సీ రేసులో అతడి ప్రవేశం ఉండొచ్చనే ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!