

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హోంగార్డ్ వెంకటరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్‌ల రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. సిట్ అధికారులు ఇద్దరినీ రెండు రోజుల పాటు విచారించి కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ప్రశ్నించారు. సాయికృష్ణ అదృశ్యం, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్ మాయం కావడం వంటి అంశాలపై అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.
సీసీ కెమెరాల నిర్వహణలో అనుభవం ఉన్న హోంగార్డ్ వెంకటరాజును ఫుటేజ్‌కు సంబంధించిన అంశాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణలో హెడ్ కానిస్టేబుల్ అశోక్, మాజీ సీఐ నాగరాజు చెప్పడంతోనే సీసీ ఫుటేజ్‌ను మాయం చేసినట్లు వెంకటరాజు వెల్లడించినట్లు సమాచారం. డీవీఆర్, హార్డ్‌డిస్క్‌లను కూడా మాయం చేసి ధ్వంసం చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలక ఆధారంగా ఉన్నట్లు కోర్టు రికార్డుల్లోనూ నమోదైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!