

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం ఆరంభంలోనే ఇంట్లో గొడవలు మొదలైనట్లు తాజా ప్రోమో సూచిస్తోంది. రేషన్, ఫుడ్ పోర్షన్ల బాధ్యతలు చూసుకుంటున్న త్రిగుణ్.. రోహిత్, షాలినీ కోసం ఉంచుకున్న పప్పును వర్షిణికి ఇవ్వడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. తనను అడగకుండా ఆహారం ఎందుకు తీసుకున్నావని రోహిత్ ప్రశ్నించగా, తాను పోర్షన్ మేనేజర్‌నని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ త్రిగుణ్ అనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆహారాన్ని వృథా చేయొద్దంటూ కెప్టెన్ సుధీర్ కూడా మధ్యలో జోక్యం చేసుకున్నాడు.
ఆ తర్వాత రోహిత్, త్రిగుణ్ ఒకరిపై ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకోవడంతో గొడవ మరింత ముదిరినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. త్రిగుణ్ ప్రవర్తనను రోహిత్ ప్రశ్నించగా, రోహిత్ పనితీరు, మాటతీరుపై త్రిగుణ్ విమర్శలు చేశాడు. తన కమ్‌బ్యాక్ కోసం వేచి చూడాలని రోహిత్ సుధీర్‌తో అనగా, సుధీర్ కూడా స్పందించాడు. ఇప్పటికే అపూర్వ, చరణ్ ఎలిమినేషన్ తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఇంట్లోకి రావడంతో వాతావరణం వేడెక్కింది. రోహిత్, షాలినీ ఆటతీరుపై కొత్త సభ్యులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఆహార వివాదం మరింత చర్చకు దారితీసింది. అయితే, గొడవ ఎలా మొదలైందనే పూర్తి వివరాలు ఎపిసోడ్‌లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!