

బిగ్ బాస్ తెలుగు 10లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా సాగింది. నిన్న ప్రసారమైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు నేరుగా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా టాస్క్‌లో గెలిచి నామినేషన్ అర్హత సాధించేలా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మొత్తం 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. ముగ్గురు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.
ఎపిసోడ్ ప్రారంభం నుంచే త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆర్జే చరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి రోహిత్ కూడా ఒక కారణమని త్రిగుణ్ ఆరోపించాడు. చరణ్‌ను ఎంపిక చేయడంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారని, అందులో రోహిత్ పాత్ర కూడా ఉందని అతను వాదించాడు. అయితే చరణ్ తన వల్ల ఎలిమినేట్ కాలేదని రోహిత్ స్పష్టం చేశాడు. అయినప్పటికీ త్రిగుణ్ తన వాదనను కొనసాగిస్తూ.. ప్రపంచమంతా రోహిత్ తప్పు అని చెప్పినా అతను అంగీకరించడంటూ వ్యాఖ్యానించాడు. రాత్రి సమయంలోనూ ఇద్దరి మధ్య మరోసారి మాటలు జరిగాయి. సింక్‌లోని గిన్నెలను తాను కడుగుతానని త్రిగుణ్ చెప్పగా.. రోహిత్ తన పని తానే చేసుకుంటానని చెప్పాడు. ఇక నామినేషన్స్ సమయంలో రోహిత్ గతంలో చేసిన హెచ్చరికను త్రిగుణ్ ప్రస్తావిస్తూ.. తనకు అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!