

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వారంలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. షో ప్రారంభమైన కొద్ది రోజులకే ఆర్జే చరణ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్‌ను వీడగా, మరుసటి రోజే నటి చైత్ర రాయ్ కూడా ఎలిమినేట్ అయ్యారు. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ జరిగే బిగ్ బాస్‌లో.. ఈసారి ఐదు రోజుల్లోనే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చరణ్, చైత్రలను సీక్రెట్ రూమ్‌లో ఉంచి తిరిగి హౌస్‌లోకి తీసుకొస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆదివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ఇద్దరూ నిజంగానే ఎలిమినేట్ అయ్యారని స్పష్టం చేశారు. వారితో ప్రత్యేకంగా వీడియో కాల్‌లోనూ మాట్లాడారు.
ఇక బుల్లితెరపై ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర రాయ్ తొలి వారంలోనే ఎలిమినేట్ కావడంపై ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ హౌస్‌లో ఆమెకు దక్కిన రెమ్యూనరేషన్‌పై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చైత్రకు వారానికి సుమారు రూ.2.25 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పారితోషికం అందినట్లు ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.35 వేల వరకు ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మొత్తాలపై అధికారిక ధ్రువీకరణ లేదు. మరోవైపు చైత్ర, చరణ్‌లు త్వరలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో కలిసి మళ్లీ హౌస్‌లోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!