

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారంలోకి అడుగుపెట్టడంతో నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో వేడిని పెంచింది. ఈ నేపథ్యంలో వెల్లడైన అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం సుధీర్ 24.41 శాతం ఓట్లతో 3,929 ఓట్లు సాధించి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడికి అత్యంత సమీపంలో త్రిగుణ్ 24.25 శాతం ఓట్లతో 3,904 ఓట్లు సాధించాడు. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉంది. చరణ్ 14.16 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. షాలిని 9.84 శాతం, వంశీ 9.14 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక అన్‌అఫీషియల్ ట్రెండ్స్‌లో అమన్ 6.95 శాతం, వర్షిణి 6.14 శాతం, ఝాన్సీ 5.1 శాతం ఓట్లతో దిగువన ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిని ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లుగా పేర్కొంటున్నారు. అయితే ఓటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు కాబట్టి ఈ లెక్కలు తుది ఫలితాలు కావు. మిగిలిన సమయంలో ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా స్థానాలు మారే అవకాశం ఉంది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అధికారిక ఓటింగ్ ఫలితాలు, బిగ్ బాస్ ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!