15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

Writer: Chandrika 02:31 PM, 15 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో దేబ్జానీ మోదక్‌ తనదైన మాటతీరు, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ప్రత్యేకమైన స్పందనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హౌస్‌లో అందరితో కలిసిపోయే విధానం, తోటి కంటెస్టెంట్లతో మాట్లాడే తీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. బెంగాలీ కుటుంబంలో జన్మించిన దేబ్జానీ.. వ్యాపారవేత్త అపూర్బా మోదక్‌, గృహిణి మితా మోదక్‌ దంపతుల కుమార్తె. ఆమెకు నందిని మోదక్‌ అనే చెల్లెలు ఉంది. చిన్నతనంలో నటనపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. అనుకోకుండా ఓ సీరియల్‌లో అవకాశం రావడంతో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. అలా బెంగాలీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

తెలుగులో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌ దేబ్జానీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సీరియల్‌లో తన నటన, మాటతీరుతో ఆమె బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే గుర్తింపుతో బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి అడుగుపెట్టిన ఆమె.. మొదటి నుంచే తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా.. హౌస్‌లోని ముకేశ్‌ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. ముకేశ్‌ అందరితో సరదాగా మాట్లాడతాడని, కానీ తన దగ్గరకు మాత్రం పెద్దగా రావడం లేదని ఆమె చెప్పింది. కాఫీ అంటే తనకు ఎంత ఇష్టమో.. ముకేశ్‌ అంటే కూడా అంతే ఇష్టమని, అతడి కళ్లు తనకు చాలా నచ్చుతాయని వెల్లడించింది. దీంతో ఆమె నిజంగానే ముకేశ్‌ను ఇష్టపడుతోందా? లేక గేమ్‌లో భాగంగానే ఇలా చెబుతోందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు తాను ఆరో తరగతిలో ఫెయిల్‌ కావడంతో ఆ తరగతిని రెండుసార్లు చదవాల్సి వచ్చిందని కూడా దేబ్జానీ తెలిపింది. మొత్తంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె ప్రయాణం ఎంతవరకు సాగుతుంది? టైటిల్‌ పోరులో నిలిచి కప్‌ సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10దేబ్జానీ మోదక్‌బిగ్‌బాస్‌ తెలుగుదేబ్జానీ బిగ్‌బాస్‌ఎన్నెన్నో జన్మల బంధంతెలుగు టెలివిజన్‌బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ముకేశ్‌తెలుగు టీవీ నటిబిగ్‌బాస్‌ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ
సినిమాలు

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
బిజినెస్

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
సినిమాలు

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..
జనరల్

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు
క్రీడలు

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...
రాజకీయాలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్
రాజకీయాలు

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..
షోస్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి
రాజకీయాలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి