

ఉత్తరప్రదేశ్‌లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య నార్తర్న్ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం ఎక్కువ సమయం పట్టే ఢిల్లీ-వారణాసి ప్రయాణం కేవలం మూడున్నర గంటల్లోనే పూర్తికానుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ఉత్తరప్రదేశ్‌లో హైస్పీడ్ రైలు ప్రయాణానికి కొత్త మార్గం ఏర్పడనుంది.
ఈ బుల్లెట్ ట్రైన్‌లో విమాన ప్రయాణ ఛార్జీల కంటే తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం లభించనుంది. ఢిల్లీ-వారణాసి మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడటంతో పాటు మార్గంలోని ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం, ప్రారంభానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!