
జనరల్

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, వేతనాల చెల్లింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ పోర్టల్ విధానంలో అవసరమైన సవరణలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందని, ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు అందేలా విధానపరమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!