

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తన జోక్యంతోనే ఆపించానని వ్యాఖ్యానించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడిన ఆయన, గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో 11 విమానాలు కూలిపోయాయని తెలిపారు. అయితే అవి భారత్‌వా, పాక్‌వా లేక రెండింటికీ సంబంధించినవా అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను తాను ఆపించానని, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక పాకిస్థాన్ అంశంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల చర్చల వల్లే ఉద్రిక్తతలు తగ్గాయని తెలిపింది. అయినప్పటికీ ట్రంప్ తన జోక్యంతో అణు యుద్ధాన్ని నివారించానని చెబుతున్నారు. భారత్ దాడులను ఆపించినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను అభినందించారని, కోట్లాది ప్రాణాలను కాపాడినట్లు ప్రశంసించారని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాక్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!