

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఉన్న భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా సెప్టెంబర్ 28న ఉదయం 10:30 గంటలకు గ్రూప్-Aలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-Aలో ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్ జట్లు ఉన్నాయి.
పురుషుల క్రికెట్‌లో రెండు గ్రూపులు ఉండగా.. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్తులు లభించాయి. హాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్.. జపాన్‌లోనూ టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టింది. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు.
సెప్టెంబర్ 24: ఆఫ్ఘనిస్థాన్ vs జపాన్ – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 24: హాంకాంగ్ vs మలేషియా – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 25: హాంకాంగ్ vs ఒమన్ – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 25: ఆఫ్ఘనిస్థాన్ vs నేపాల్ – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 26: జపాన్ vs నేపాల్ – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 26: మలేషియా vs ఒమన్ – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 28: పాకిస్థాన్ vs గ్రూప్-B రెండో స్థానం – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 28: భారత్ vs గ్రూప్-A రెండో స్థానం – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 29: శ్రీలంక vs గ్రూప్-A విజేత – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ vs గ్రూప్-B విజేత – ఉదయం 10:30 గంటలకు
అక్టోబర్ 1: తొలి సెమీఫైనల్ – ఉదయం 5:30 గంటలకు
అక్టోబర్ 1: రెండో సెమీఫైనల్ – ఉదయం 10:30 గంటలకు
అక్టోబర్ 3: కాంస్య పతక పోరు – ఉదయం 5:30 గంటలకు
అక్టోబర్ 3: ఫైనల్ – ఉదయం 10:30 గంటలకు
అన్ని మ్యాచ్‌లు నిషిన్‌లోని కొరోగి అథ్లెటిక్ పార్క్‌లోనే జరగనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!