
జనరల్

2026 ఆసియా క్రీడల్లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీలో భారత జోడీ చికితా తణిపర్తి, సాహిల్ జాదవ్ స్వర్ణ పతకం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణ కొరియాను షూట్‌ఆఫ్‌లో ఓడించి భారత్‌కు ఆర్చరీలో రెండో స్వర్ణాన్ని అందించారు. ఈ విజయంతో లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌కు భారత్‌కు కోటా స్థానం కూడా లభించింది.
చికితకు ఈ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణ పతకం. అంతకుముందు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలోనూ ఆమె స్వర్ణం సాధించింది. మరోవైపు వ్యక్తిగత విభాగంలో తోటి భారత ఆర్చర్ గణేశ్ మణి రత్నం తిరుమురుతో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ఓడిన సాహిల్.. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అద్భుతంగా పుంజుకుని స్వర్ణ పతకం సాధించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!