
క్రీడలు

పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలో మరో అపూర్వమైన మైలురాయిని అధిరోహించాడు. ఉజ్బెకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో గోల్ సాధించడం ద్వారా ఆరు వేర్వేరు ఫిఫా వరల్డ్‌కప్ టోర్నమెంట్‌లలో గోల్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ గోల్‌తో రొనాల్డో ప్రపంచకప్‌లలో తన మొత్తం గోల్స్ సంఖ్యను తొమ్మిదికి పెంచుకున్నాడు.
41 ఏళ్ల వయస్సులోనూ అత్యున్నత స్థాయిలో నిలకడగా రాణిస్తూ రొనాల్డో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తరాలు మారినా తన ప్రభావం ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించిన ఆయన, ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా తన స్థానాన్ని మరింత బలపరిచాడు. ఈ చారిత్రాత్మక ఘనతతో రొనాల్డో తన అద్భుత కెరీర్‌లో మరో స్వర్ణ అధ్యాయాన్ని జోడించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!