
రాజకీయాలు

భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) నూతన కార్యనిర్వాహక వర్గం ఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం మాజీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష శనివారం వెల్లడించారు. ప్రస్తుత కార్యవర్గ పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనుండగా, కొత్తగా ఎన్నికయ్యే కార్యవర్గం 2026 నుంచి 2030 వరకు బాధ్యతలు నిర్వర్తించనుంది.
జాతీయ క్రీడా పాలన చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు పీటీ ఉష తెలిపారు. అలాగే, ఐవోఏ అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికలు డిసెంబర్ 3న జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికలతో భారత ఒలింపిక్ సంఘం, అథ్లెటిక్స్ కమిషన్‌లో తదుపరి పదవీకాలానికి కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!