

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్హామ్‌లో జరిగిన గ్రూప్-2 తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు శ్రీలంకపై 87 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసింది. డ్యానీ వ్యాట్-హాడ్జ్ అజేయంగా 105 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. అమీ జోన్స్ 53 పరుగులు చేయగా, కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ కేవలం 22 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టు స్కోరును మరింత బలోపేతం చేసింది.
220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. హర్షిత సమరవిక్రమ 29 పరుగులు, నిలాక్షికా సిల్వా 39 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో శ్రీలంక 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్ చెరో రెండు వికెట్లు సాధించారు. అజేయ శతకం సాధించిన డ్యానీ వ్యాట్-హాడ్జ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!