
జనరల్

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్, హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో వెండి పతకం సాధించారు. కీలక దశల్లో ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ ఈషా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆమె సాధించిన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
నిర్ణయాత్మక షూట్‌ఆఫ్స్‌లో ఈషా సింగ్ ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును సీఎం ప్రశంసించారు. స్వల్ప తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయినా ఆమె పోరాట స్ఫూర్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించి దేశ ప్రతిష్ఠతో పాటు తెలంగాణ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!