
క్రీడలు

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ బంతితోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్‌తో రాణించడంతోపాటు, చురుకైన ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన బౌలింగ్‌లో వచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లేథమ్‌ను పెవిలియన్‌కు పంపించాడు.
ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన బంతి వేగంగా తిరిగి రావడంతో రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడం అంత సులభం కాదు. క్షణాల్లో స్పందించాల్సిన ఈ తరహా క్యాచ్‌ను గుర్నూర్ బ్రార్ ఎంతో సమయస్ఫూర్తి, చాకచక్యంతో అందుకున్నాడు. అతడి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రయత్నం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!