14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

Writer: Chandrika 10:10 AM, 14 అక్టోబర్, 2026
ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో పోరు బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. తొలి, మూడో మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. రెండో టీ20లో విండీస్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఉప్పల్‌ మైదానంలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. భారత టాప్‌ ఆర్డర్‌లో అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ కూడా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. సంజు శాంసన్‌ మాత్రం భారీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలవాల్సి ఉంది. ఈ సిరీస్‌లో సెంచరీ సాధించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చని అంచనా. అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌ పేస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

సిరీస్‌ సమం చేయాలని విండీస్‌ పట్టుదల

మరోవైపు, సిరీస్‌ను 2-2తో సమం చేయాలని వెస్టిండీస్‌ భావిస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌, కెప్టెన్‌ షై హోప్‌ కీలకంగా మారారు. తొలి మూడు మ్యాచ్‌ల్లో రూథర్‌ఫర్డ్‌ 172 పరుగులు చేయగా.. హోప్‌ 159 పరుగులు సాధించాడు. హెట్‌మయర్‌, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్‌ వంటి హిట్టర్లు కూడా జట్టుకు బలంగా ఉన్నారు. అయితే గాయంతో బాధపడుతున్న షెపర్డ్‌ ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఉప్పల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఈ పర్యటనలో ఛేదనకు దిగిన జట్లు ఎక్కువసార్లు విజయాలు సాధించడంతో టాస్‌ కీలకం కానుంది. భారత బ్యాటర్లను కట్టడి చేయాలంటే విండీస్‌ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మరోవైపు, కరీబియన్‌ హిట్టర్లను త్వరగా పెవిలియన్‌కు పంపి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌నాలుగో టీ20హైదరాబాద్‌ క్రికెట్‌ఉప్పల్‌ స్టేడియంటీమ్‌ఇండియాఅభిషేక్‌ శర్మశ్రేయస్‌ అయ్యర్‌షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌షై హోప్‌టీ20 క్రికెట్‌క్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

రణబాలిలో విజయ్‌ పీక్‌ పెర్ఫార్మెన్స్‌ చూస్తారు – రాహుల్ సంకృత్యన్
సినిమాలు

రణబాలిలో విజయ్‌ పీక్‌ పెర్ఫార్మెన్స్‌ చూస్తారు – రాహుల్ సంకృత్యన్

విజయవాడ ఉత్సవ్‌కు చైనా రాయబారి జు ఫీహోంగ్..
జనరల్

విజయవాడ ఉత్సవ్‌కు చైనా రాయబారి జు ఫీహోంగ్..

వాయిదా తర్వాత కూడా మొదలుకాని ప్రమోషన్స్‌
సినిమాలు

వాయిదా తర్వాత కూడా మొదలుకాని ప్రమోషన్స్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్ చేసిన నరేశ్, రాంప్రసాద్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్ చేసిన నరేశ్, రాంప్రసాద్

ఉత్తర అమెరికాలో పెరిగిన రణబాలి ప్రీ-సేల్స్  జోరు
సినిమాలు

ఉత్తర అమెరికాలో పెరిగిన రణబాలి ప్రీ-సేల్స్ జోరు

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం
గాసిప్స్

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?
సినిమాలు

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?
గాసిప్స్

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?
సినిమాలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?
గాసిప్స్

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!