
జనరల్

జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్లుగా అడుగుపెడుతున్న భారత అండర్-21 పురుషుల, మహిళల జట్లు టైటిళ్లను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. పురుషుల జట్టుకు డిఫెండర్ అన్‌మోల్ ఎక్కా సారథ్యం వహిస్తుండగా, రికార్డు స్థాయిలో ఆరో టైటిల్‌ను సాధించడంపై జట్టు దృష్టి సారించింది. పూల్-ఎలో సెప్టెంబర్ 5న ఇండోనేసియాతో, 6న జపాన్‌తో, 8న కొరియాతో, 9న చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది.
మరోవైపు ఖైడెమ్ షిలీమాచాను కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు హ్యాట్రిక్ టైటిళ్లపై కన్నేసింది. సెప్టెంబర్ 5న కొరియాతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్, 6న మలేసియాతో, 8న జపాన్‌తో, 9న చైనాతో తలపడనుంది. రెండు జట్లూ డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతుండటంతో టోర్నీలో భారత్ ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!