
జనరల్

వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 33 ఏళ్ల శ్రీకాంత్ 21-18, 21-19తో కెనడాకు చెందిన ప్రపంచ 9వ ర్యాంకర్ విక్టర్ లాయ్‌ను వరుస గేముల్లో ఓడించి సంచలన విజయం సాధించాడు. మరోవైపు స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 22-24, 21-9తో ఫ్రెంచ్ సోదరులు క్రిస్టో-టోమా జూనియర్ పొపొవ్‌పై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో వర్ధమాన తార తన్వీ శర్మ 17-21, 21-18, 16-21తో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమొకా మియాజాకి చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ 18-21, 18-21తో లియు కాంగ్-సు ఇన్ చేతిలో పరాజయం పాలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!