17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి

Writer: Harika S 07:28 AM, 17 ఆగస్టు, 2026
సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిస్తోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఈ మెగా టోర్నీలో ప్రపంచంలోని అగ్రశ్రేణి షట్లర్లు బరిలోకి దిగనున్నారు. సొంతగడ్డపై భారత క్రీడాకారులు సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో ఐదు పతకాలు సాధించిన సింధు.. మరో పతకంతో తన ఖాతాను మరింత పెంచుకోవాలని చూస్తోంది. సెమీఫైనల్‌కు చేరితే కనీసం కాంస్యం ఖాయం కావడంతో ఆరు ప్రపంచ పతకాలతో అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంటుంది.

సింధుకు డ్రా కూడా అనుకూలంగా ఉంది. తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌తో తలపడనుంది. ప్రీక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ వాంగ్‌ జీ యీతో పోటీ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇండోనేసియాకు చెందిన పుత్రి కుసుమ వర్దనితో క్వార్టర్‌ఫైనల్‌ పోరు ఉండొచ్చు. అన్ని అడ్డంకులను అధిగమిస్తే ఫైనల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ అన్‌ సె యంగ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అకానే యమగూచి, చెన్‌ యుఫీ కూడా టైటిల్‌ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నారు.

మరోవైపు భారత యువ షట్లర్‌ ఉన్నతి హుడా తొలి రౌండ్‌లో మయన్మార్‌కు చెందిన తెట్‌ హ్టార్‌ తుజార్‌తో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీపై కూడా భారీ అంచనాలున్నాయి. స్వదేశంలో జరిగే ఈ టోర్నీలో భారత షట్లర్లు పతకాల పంట పండించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు

అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!

ట్యాగ్లు
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్పీవీ సింధుసాత్విక్‌ చిరాగ్బ్యాడ్మింటన్భారత్ఉన్నతి హుడా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏంటి?.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!
సినిమాలు

లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏంటి?.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి
క్రీడలు

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి

అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు
క్రీడలు

అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...
క్రీడలు

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే
జనరల్

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్
జనరల్

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
క్రీడలు

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్
సినిమాలు

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
జనరల్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!